'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్' సినిమాతో బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన హీరో ధర్మేంద్ర తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడి చేసి సంచలనం సృష్టించారు. ఆడవాళ్ళు నిండుగా శరీరాన్ని కప్పుకుంటేనే బాగుంటారట... తమ అందం ఎప్పుడూ బయటపెడితే చూసే వాళ్ళకు బోర్ కొడుతుందట. కట్టుబొట్టు నిండుగా ఉంటేనే, ఆడవాళ్లు మరింత అందంగా ఉంటారని అంటున్నాడు. ఆయన కాలం నాటి హీరోయిన్లే బాగున్నారని అంటున్నాడు. తాను ఇప్పుడు ట్రెండ్ ను విమర్శించడం లేదనీ, తప్పు పట్టడం లేదనీ, ఇది తన అభిప్రాయం మాత్రమేనని అంటున్నాడు. జూలై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తన సినిమా ముచ్చట్లను మీడియాతో పంచుకున్న ధర్మేంద్ర ఈ విషయాలను మాట్లాడాడు. అయితే ఆయన నటించిన ఈ సినిమాలో భర్త సెకెండ్ సెటప్ ల గురించి ఉంటుందట. అందుకే ఈ సినిమాకు సెకండ్ హ్యాండ్ హజ్ బెండ్ అని టైటిల్ పెట్టారట. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనీ, కుటుంబమంతా చూసేలా ఉంటుందని చెప్పాడు ధర్మేంద్ర. ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటించిన ధర్మేంద్ర ఇప్పుడు ఇలాంటి కథతో మళ్ళీ సినిమాలో నటించడం విశేషం. ఈయన అప్పట్లో హేమామాలిని రెండో వివాహం చేసుకున్నాడు.... వీళ్ళ లవ్ స్టోరీ చాన్నాళ్ళు నడిచిన మీదట... చివరికి మూడు ముళ్ళతో ఒక్కటయ్యారు. ఈ కథకు మరి ఈయన లైఫ్ ఏమైనా యాప్ట్ అవుతుందా అని సామాన్యులు, సినిమా వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు.