చిన్న సినిమాగా వచ్చి సంచలనాలు సృష్టించిన చిత్రాలు మిగతా భాషల్లో పొలిస్తే తెలుగులో చాలా అరుదు. కానీ, పెద్ద-చిన్నా తేడా లేకుండా మన చిత్రాలకు విదేశీ మార్కెట్లో ఈ మధ్య కాలంలో బాగా గిరాకీ ఏర్పడింది. గతేడాది చిన్న బడ్జెట్ చిత్రంగా తెరకెక్కి భలే భలే మగాడివోయ్ తో దాదాపు 40 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యాడు నేచురల్ స్టార్ నాని. ఇక ఇప్పుడు కృష్ణగాడిగా కూడా తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.
ఈ చిత్రం యూఎస్ లో భారీ వసూళ్లను సాధిస్తూ తన సత్తా చాటుతోంది. ఇంతవరకూ కృష్ణగాడి వీర ప్రేమగాథ అక్కడ 4.82 కోట్లను వసూలు చేసి, అదే వేగంతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్లు ఓ మాదిరిగా వసూళ్లు ఉన్నప్పటికీ అక్కడ మాత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. గతంలో ' భలే భలే మగాడివోయ్' ఆయన కెరియర్లో రికార్డు స్థాయిలో అక్కడ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఆ రికార్డుకు దగ్గరలో వుండటం విశేషం. కృష్ణాష్టమి ఫ్లాప్ టాక్ రావటం, ప్రస్తుతానికి తెలుగులో ఆకట్టుకునే సినిమాలు లేకపోవటంతో అక్కడ-ఇక్కడ కూడా మరో వారం కృష్ణగాడు కలెక్షన్లు కుమ్ముకునే అవకాశం ఉంది.