చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లు ఇప్పుడొచ్చే సినిమాలలో వారసత్వ హీరోలు ఎవరికివారు ఆయా పెద్దల సినిమాల్లోని పాటనో, సీన్లనో, డైలాగులనో ఏదో రూపంలో వాడుకోవడం పరిపాటి అయ్యింది. రీసెంట్ గా రిలీజైన నారా రోహిత్ రౌడీఫెల్లో చిత్రంలో కూడా ఇది రిపీట్ అయ్యింది. ఓ సన్నివేశంలో బాలయ్య బాబును ఉదహరిస్తే... మరోక సీన్లో ఏకంగా యుగపురుషుడు ఎన్టీఆర్ క్లాసిక్ సాంగ్ ‘ఎంతవారు కానీ’ పాటను వాడేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయానా పెద్దనాన్న కావడంతో ఇలా నందమూరి పరిమళాలు వెదజల్లడం సర్వసాధారణమే. కానీ, ఇక్కడే ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ ఉందండోయి... చిత్రంలో ఓ మూడు మెగా సీన్లు కనువిందు చేస్తాయి. ఓపెనింగ్ సన్నివేశమే మెగాస్టార్ చిరంజీవి ఖైదీనెం.786 చిత్రంలోని హిట్ సాంగ్ ‘అటు అమలాపురం’ సాంగ్ తో ప్రారంభంకాగా, ఇంకో సీన్ లో అత్తారింటికిదారేది చిత్ర ప్రదర్శనను చూపించడం జరిగింది. ఇక మరో సన్నివేశంలో బన్నీ ఆర్య చిత్ర పోస్టర్ ను కూడా వాడుకున్నారు. ఇక ప్రేక్షకులు కూడా నందమూరి సీన్లకు ఎలా రెస్పాన్స్ ఇచ్చారో మెగా సీన్లకు కూడా అంతే రేంజ్ లో గోలగోల చేశారు. ఇప్పుడు చర్చేంటంటే ఈ పని కావాలనే చేశారా? లేక కాకతాళీయమా? ఏదైతేనేం... ప్రేక్షకులు ఫుల్ ఖుష్.