సెకండ్ ఇన్నింగ్స్ ఇంత డీ గ్లామరా?

December 11, 2014 | 05:42 PM | 60 Views
ప్రింట్ కామెంట్

ఇద్దరమ్మాయిలతో చిత్రంలో కొమలి... అదేనండీ అమలాపాల్. ఆ చిత్రంలో సాంప్రదాయబద్ధంగా ఎంతో అందంగా కనిపించింది కదా. మరి పెళ్లి తరువాత ఏమిటి ఇలా అని ఆశ్చర్యంగా పడుతున్నారా ? కానీ అంత ఆశ్చర్యమేమీ లేదు లేండి. ఇది ఒక డీ గ్లామర్ సినిమా. పెళ్లి తర్వాత ఆమె చేస్తున్న తొలి సినిమా లుక్. మలయాళ చిత్రం మిల్లీ తో వెండితెరపై సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతుంది. రాజేష్ పిళ్లై దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్ డీగ్లామర్ పాత్రను పోషించనుంది. పాత్రలో సహజత్వం కోసం మేకప్ లేకుండా ఈ చిత్రంలో నటించబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. సినిమా కథాంశం విషయానికొస్తే... అందవిహీనంగా ఉన్నాననే భావనతో అసంతృప్తికరమైన జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ మధ్యతరగతి యువతి ఎలా అందాలరాణిగా మారింది? తన జీవితాన్ని ఏ విధంగా ఆనందమయం చేసుకుంది? అనేది మెయిన్ స్టోరీ. ఇందులో ఆమె పాత్ర విభిన్నంగా, ఆదర్శవంతంగా ఉంటుందని అంటున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించింది అమలాపాల్. ఆమె నటించిన చివరి సినిమా వేలైఇల్లా పట్టాధారి విడుదలై దాదాపు ఆరు నెలలయింది. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిందనే అంతా అనుకున్నారు. ఆ మధ్య ఆమె తల్లికాబోతున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ