రేటు పెంచిన అంజలి పాప

December 10, 2014 | 03:15 PM | 36 Views
ప్రింట్ కామెంట్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతోనే ఒక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న అంజలికి ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. పిల్ల జమీందార్ ఫేం అశోక్ భాగమతి పేరుతో సినిమా తీయబోతున్నాడు. ముందుగా అనుష్కను అనుకున్న అశోక్ ఆమె కాల్షీట్లతో బిజీగా ఉండడంతో ఆమె స్థానంలో అంజలిని బుక్ చేశాడు. అంతే కాకుండా అంజలి ఈ మధ్య ఏదో ఒక రకంగా వార్తల్లో ఎక్కువగానే కనిపిస్తోంది. అందుకే ఆమె పారితోషికం బాగా పెంచేసింది. ఈమె మెయిన్ రోల్ పోషిస్తుండంతో ఈ చిత్రానికి కోటి రూపాయలు తీసుకోబోతున్నట్టు సమాచారం. అనుష్క చేసే పాత్ర ఆమెకు రావడమే ఒక అద్రుష్టం కాగా, హిస్టారికల్ స్టోరీ మూవీ కావడంతో తను ఈ సినిమాకు ఇంత రెమ్యునరేషన్ అడిగినట్టు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. మరి ఆమెకు అడిగినంత ఇస్తారా? ఏమైనా తన దశ తిరిగిందనే చెప్పాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ