ఇప్పుడున్న హీరోయిన్లలో అందచందాలలో, నటనపరంగా అనుష్కకు అగ్రస్థానం ఖచ్చితంగా ఇవ్వచ్చు. అలాంటి అందాల భామ అభిమానులకు దూరమవడం బాధాకరమైన విషయం. ప్రస్తుతం రజనీ సరసన నటించిన లింగా రిలీజ్ కాబోతుంది, బాహుబలి, రుద్రమదేవి,లాంటి చారిత్రాత్మక భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయా సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసుకోవాలని భావిస్తోంది. కొత్త ప్రాజెక్టులకు కూడా కమిట్ అవడం లేదు. మంచి చారిత్రాత్మక కథ భాగమతికి కూడా నో చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా అనుమానం కలగకుండా ఉండదు. కదా. అయితే ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలనీన పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోవాలని ప్లాన్ చేసుకుంటోందట. అయితే అనుష్క వివాహం చేసుకోబోయే వ్యక్తి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని, అతనో యూఎస్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ అని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.