హీరోయిన్ అవుదామని, అసలు సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదట అందాల భామ అనుష్క శర్మ. సినిమా పరిశ్రమకు వచ్చి ఆరేళ్లయినా చేసింది మాత్రం ఏడంటే ఏడు చిత్రాలే. తొలి చిత్రం రబ్ నే బనా దీ జోడీ తో హిట్ తోపాటు నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఒక్కో సినిమాతో తన పాపులారిటిని పెంచుకుంటూ ఇన్నేళ్లకు తాను టాప్ నాయికల్లో ఒకదానిగా గుర్తింపు తెచ్చుకుంది. బ్యాండ్ బాజా బారాత్ నా కెరీర్ లో రెండో పెద్ద హిట్. యువ దర్శకుడు మనీష్ శర్మ దాన్ని అద్భుతంగా రూపొందించారు. మేము సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎవరూ నన్ను ఇంటర్వ్యూ చేసేందుకు ముందుకురాలేదు. కానీ ఇప్పుడు అగ్ర కథానాయిక జాబితాలో నేను కూడా ఉన్నాను. రణబీర్ కపూర్, రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనేలా ఓవర్ నైట్ స్టార్ ను కాలేదు అంటూ చెప్పుకొచ్చింది. పనిలో పనిగా జబ్ తక్ హై జాన్ లో నటించిన తన తోటి నటి కత్రినా కైఫ్ ఫేవరెట్ స్టార్ గా అనుష్క చెప్పింది. వందకోట్ల సినిమా అని కాకుండా తాను గర్వించదగ్గ సినిమాలు మాత్రమే చేస్తానని అమ్మడు అంటోంది. ఇన్నీ చెబుతోంది కానీ విరాట్ కోహ్లీ గురించి మాత్రం పెదవి విప్పడంలేదేంటి చెప్మా?