'చెంబు చిన సత్యం' ఫస్ట్‌ లుక్ అండ్ ట్రైలర్ ఆవిష్కరణ

June 01, 2015 | 02:46 PM | 10 Views
ప్రింట్ కామెంట్
chembu_china_satyam_firstlook_and_trailer_nihaonline

సుమన్‌శెట్టి, ప్రమోదిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చెంబుచిన సత్యం’.  ఎల్‌ఐసీ ఏజెంట్ ఉపశీర్షిక.ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్నారు. నామాల రవీంద్రసూరి దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో దర్శకుడు ఎన్.శంకర్ ఆవిష్కరించారు. థియేట్రికల్ ట్రైలర్‌ను నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ ‘కలకు, కళకు మధ్య ఉన్న తేడాను తెలియజేస్తూ సృజనతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టైటిల్ అలరించేలా ఉంది. హారర్, కామెడీ జోనర్‌లో రూపొందిన చిత్రాలు ఈ మధ్యకాలంలో చక్కటి విజయాల్ని అందుకుంటున్నాయి.ఆ జాబితాలో ఈ సినిమా చేరుతుందనే నమ్మకముంది’ అన్నారు. దర్శకుడు రవీంద్రసూరి మాట్లాడుతూ ‘హారర్ ఎంటర్‌టైనర్ ఇది. చెంబు చినసత్యం ఎలాంటి కల గన్నా నిజజీవితంలో అది వాస్తవంగా మారుతుంటుంది. అలాంటి యువకుడి జీవితంలో ఓ కల ఏ విధమైన అలజడిని రేపింది?ఓ ప్రమాదం బారి నుంచి తన కుటుంబాన్ని అతడు ఏ విధంగా రక్షించుకున్నాడు? అన్నది ఈ చిత్ర ఇతివృత్తం. కథను నమ్మి ఈ సినిమాను తెరక్కించాను’ అని తెలిపారు. టైటిల్ అన్ని వర్గాల వారిని అలరించేలా ఉందని, సినిమా విజయవంతం కావాలని మల్కాపురం శివకుమార్ ఆకాంక్షించారు. ‘వినోదం,హారర్, ప్రేమ, సెంటిమెంట్ మేళవింపుతో రూపొందిన చిత్రమిది. నా ఆలోచనలకు అనుగుణంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తప్పకుండా అన్ని వర్గాల వారిని మెప్పిస్తుందనే నమ్మకముంది.భవిష్యత్‌లో ఈ బ్యానర్‌పై మరిన్ని మంచి సినిమాలు రూపొందిస్తాను’ అని నిర్మాత సాంబశివరావు తెలిపారు. సుమన్‌శెట్టి మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగా వచ్చింది. ట్రైలర్, పాటలు, టైటిల్ అన్ని చక్కగా కుదిరాయి’ అని పేర్కొన్నారు. కథానాయికగా తన తొలి చిత్రమిదని ప్రమోదిని తెలిపింది. నేపథ్యసంగీతం, పాటలకు ప్రాధాన్యమున్న సినిమాఇదని విజయ్‌కురాకుల చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయభాస్కర్, మౌనశ్రీమల్లిక్, సూర్య, తోట.వి.రమణ, శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు. వాసు ఇంటూరి, శరశ్చంద్ర, మాస్టర్ ఆద్యశ్రీమహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణ, ఎడిటింగ్: ఎడిటర్ వెంకట్, సంగీతం: విజయ్ కురాకుల, పాటలు: మౌనశ్రీ మల్లిక్, నిర్మాణ నిర్వహణ: శ్రీహర్ష ఆలూరి, నిర్మాత: ఆలూరి సాంబశివరావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: నామాల రవీంద్రసూరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ