‘మెగా కాంపౌండ్ లో కలతలు’ ఈ టైటిల్ తో కొన్నాళ్లు తెలుగు మీడియా పండగ చేస్కుంది. వారి మధ్య వైరాల సంగతి ఎలా ఉన్న రాజకీయంగా మాత్రం మెగా బ్రదర్స్ మధ్య విబేధాలు ఉన్న మాట వాస్తవమే. ఇలా గొడవలపై వార్తలు షికారు చేస్తున్నా, మధ్యలో ఇద్దరూ కలుసుకుంటూనే వున్నారు. కుటుంబ సంబంధ విషయాలను గురించి మాట్లాడుకుంటూనే వున్నారు. బ్రూస్ లీ టైంలో పవన్ స్వయంగా చిరు ఇంటికి వెళ్లి చెర్రీని విష్ చేయటం, తాజాగా చిరు సర్దార్ సెట్ కి వెళ్లి సందడి చేయటం తెలిసింది. ఇలా గ్యాప్ తర్వాత ఈ మెగా బ్రదర్స్ తిరిగి ఒకటవుతున్న వేళ పవన్ కల్యాణ్ కి చిరంజీవి ఓ కీలక సలహా ఇచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం తెలుగు తెరపై అగ్రకథానాయకుడిగా పవన్ కల్యాణ్ కొనసాగుతున్నాడు. వీలైనంత త్వరగా ఆయన అంగీకరించిన సినిమాలను పూర్తిచేసి, పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడట. ఈ విషయం పై ఈ మధ్య మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. కానీ, చిరు మాత్రం అప్పుడే అలాంటి ఆలోచన పనులు చెయొద్దని పవన్ కు సలహా ఇస్తున్నాడంట. సినిమాల పరంగా రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదని వారిస్తున్నాడట. కెరీర్ పీక్ లో ఉన్న ఈ టైంలో తాను చేసిన తప్పు తమ్ముడు చెయ్యొద్దనేది చిరు అభిమతం అయి ఉండొచ్చు.
అయితే ఎట్టి పరిస్థితుల్లో 2018 కల్లా ఫ్రీ అయిపోయి, పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టాలని పవన్ భావిస్తున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అదే నిజమైతే చిరు చెప్పిన మాట విని పవన్ మనసు మార్చుకుంటాడా? లేక తన పంథాలో కొనసాగుతాడా అన్న ప్రశ్నకు సమాధానం దొరకాలంటే రెండేళ్లు ఆగాల్సిందే.