రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'లింగ' చిత్రానికి సివిల్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. చిత్ర నిర్మాత రవిరత్నం వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం శుక్రవారం మధ్యాహ్నంలోగా రూ.10 కోట్లు కట్టాలని ఆదేశించింది. లేకుంటే చిత్ర ప్రదర్శన ఆపాల్సి ఉంటుందని హెచ్చరించింది. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఉదయం ప్రపంచవ్యాప్తంగా 'లింగ' విడుదలకానున్న సంగతి తెలిసిందే. కాగా, కోర్టు ఆదేశాన్ని తాము గౌరవిస్తామని చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తెలిపారు. కోర్టు కోరినట్టుగా డబ్బు కడతామని, సినిమా ముందుగా అనుకున్నట్లుగానే విడుదల అవుతుందని ఆయన చెప్పారు. కాగా ఈ చిత్ర స్పెషల్ షో కిగానూ టికెట్ ధర 12వేల పలుకుతుందటే తమిళనాట తలైవా అభిమానం ఎంత ఉందో అర్థం చేసుకొవచ్చు. అయిన దీనిముందు పదికోట్లు ఎంత లేండి!