దాసరి మళ్లీ పెద్ద హీరోలపైనే పడ్డాడు

February 26, 2016 | 11:16 AM | 3 Views
ప్రింట్ కామెంట్
dasari-narayana-rao-on-big-heros-thatres-occupency-niharonline

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న చిత్రాలకు ఎదురయ్యే సమస్యలు అన్ని ఇన్నీ కావు. మంచి కథలపై నమ్మకంతో అప్పు సొప్పు చేసి నిర్మించే చిత్రాలకు థియేటర్లు దొరక్క చాలా వరకు జనాల దగ్గరికి చేరకుండా ఉండిపోతున్నాయి. అయితే కొందరి పెద్ద నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సావాసం ఉంటే మాత్రం ఆ చిత్రానికి ఏం ఢోకా ఉండదు. అందరికీ ఈ నియమం వర్తించదు కూడా. టాలీవుడ్ లో చిన్న చిత్రాలకు, నిర్మాతలకు అండగా ఎప్పుడూ వ్యాఖ్యలు చేసే దర్శకరత్న దాసరి నారాయణరావు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.

                                   తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడున్న స్థితిలో పెద్ద హీరోలు లేకుంటే, ఆ చిత్రం అమ్ముడయ్యే పరిస్థితి లేదని దర్శకరత్న ఆయన వ్యాఖ్యానించారు. సినిమా విడుదలకు ముందే డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్సులు ఇచ్చే పరిస్థితి కూడా పోయిందని, ముఖ్యంగా దీనివల్ల చిన్న నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. . వెన్నెల కిషోర్-పావని హీరోయిన్లుగా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావు తీసిన ఎలుకా మజాకా చిత్ర ప్రెస్ మీట్ లో ఆయన పై ఈ వ్యాఖ్యలు చేశారు.  

పరిస్థితి ఎంతలా మారిందంటే నిర్మాతలే థియేటర్స్ ను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతంగా తమ జేబులోని డబ్బులు పెట్టుకుని నిర్మాతలు చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే చిన్న చిత్రాలు అయినప్పటికీ ఎవరి అండా లేకుండా కంటెంట్ బలంతో, వెరైటీ ప్రమోషన్లతో హిట్ లిస్ట్ లో చేరిన చిత్రాలు చాలానే ఉన్నాయనేది బహుశా దర్శకరత్నకి తెలీకపోవచ్చు. హిట్ టాక్ వస్తే చిన్న చిత్రాలకైనా పెద్ద సినిమాలను పక్కన బెట్టి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల సంఖ్యల పెంచిన రోజులు ఉన్నాయి కూడా.  మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితికి, చిన్న నిర్మాతల దీనస్థితికి కారణం పెద్ద హీరోలే అని దాసరి మరోసారి చాటిచెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ