‘ధనలక్ష్మి తలుపు తడితే’ ఆడియో ఆవిష్కరణ

June 06, 2015 | 12:28 PM | 0 Views
ప్రింట్ కామెంట్
audio_dhanalakshmi_taluputadite_niharonline

మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ‘ధనలక్ష్మి తలుపు తడితే’ ఆడియో విడుదలైంది. బోలే శావలి సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం పాటలు ‘మ్యాంగో మ్యూజిక్‌’ ద్వారా మార్కెట్‌లో లభ్యం కానున్నాయి. హైద్రాబాద్‌లోని తాజ్‌ బంజారాలో అత్యంత సందడిగా జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ సినిమాటోగ్రఫి మినిస్టర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ చిత్ర గీతాలను ఆవిష్కరిచారు. ధనరాజ్‌, మనోజ్‌నందం, రణధీర్‌, అనిల్‌ కళ్యాణ్‌, విజయ్‌సాయి, శ్రీముఖి, నాగబాబు, సింధు తులాని, తాగుబోతు రమేష్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా సాయి అచ్యుత్‌ చిన్నారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రసాద్‌ మల్లు (యుఎస్‌ఎ)`ప్రతాప్‌ భీమిరెడ్డి (యుఎస్‌ఎ) ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌. ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్‌, మల్కాపురం శివకుమార్‌, ప్రతాని రామకృష్ణగౌడ్‌, ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి, కొడాలి వెంకటేశ్వర్రావు, పొలిచర్ల హరినాధ్‌, బెక్కెం వేణుగోపాల్‌, బి.ఎ.రాజు, సురేష్‌ కొండేటి, ‘సంధ్య’ రవి, అమ్రేష్‌కుమార్‌.. ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి, సునీల్‌కుమార్‌రెడ్డి, రేలంగి నర్శింహారావు.. ప్రముఖ యాంకర్స్‌ రష్మి, ప్రదీప్‌ తదితరులు ముందుగా ‘ధనలక్ష్మి తలుపు తడితే’ గీతాలను, ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘జబర్దస్త్‌’ టీమ్‌ చేసిన ‘హాస్య హంగామా’ ఆహుతులను విశేషంగా అలరించింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ పూర్తి సహాయసహకారాలు అందించడం వల్ల ‘ధనలక్ష్మి తలుపు తడితే’ సినిమా చాలా బాగా వచ్చిందని దర్శకుడు సాయి అచ్యుత్‌ చిన్నారి అన్నారు. ఈ చిత్రంలో పాటలతోపాటు చిరకాలం గుర్తుండిపోయే ‘కనకధార’ శ్లోకాలను స్వరపరిచే సదవకాశాన్నిచ్చిన నిర్మాతలకు, దర్శకుడికి సంగీత దర్శకుడు బోలే శావలి కృతజ్ఞతలు తెలిపారు. తన ఆహ్వానాన్ని మన్నించి ఆడియో వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధనరాజ్‌ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్‌లో తనకు సహాయసహకారలు అందించిన తన మిత్రులందర్నీ ఆయన గుర్తు చేసుకున్నారు. ధనరాజ్‌పై గల అభిమానంతో ఈ సినిమాకి అందరూ ప్రాణం పెట్టి పనిచేసారని, అందువల్ల సినిమా అద్భుతంగా వచ్చిందని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయని ఈనెలాఖరుకు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ వేడుకలో ఎడిటర్‌ శివ వై.ప్రసాద్‌, కెమెరామెన్‌ జి.శివకుమార్‌లతోపాటు యూనిట్‌ సభ్యులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకొన్నారు!!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ