సంక్రాంతికి చాలా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయనీ, పోటీ ఎక్కువుంటుందనే చర్చలు ఇప్పటివరకూ జరుగుతూ వచ్చాయి. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడమనేది ఒక సెంటిమెంట్ గా వస్తోంది. ఆ రోజున సినిమాలు విడుదల చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు కోరుకుంటారు. ఒకప్పుడు సంక్రాంతి స్టార్‌గా ఎన్టీఆర్, కృష్ణ, బాలకృష్ణ, నిర్మాత ఎంఎస్.రాజు సినిమాలు ఉండేవి. ఈ మధ్య రామ్‌చరణ్ కూడా ఆ కోవలోనే చేరిపోయాడు. సంక్రాంతి సినిమాల బరిలో గోపాల గోపాల, టెంపర్, రుద్రమదేవి, ఐ వంటి సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయనే వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ లిస్టులో గోపాల గోపాల ఒక్కటే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మిగతా సినిమాలు కొన్ని కారణాల వల్ల విడుదల చేయడం లేదు. కొత్తగా శర్వానంద్ మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, కమల్ ఉత్తమ విలన్, అజిత్ ఎంతవాడు గాని, కళ్యాణ్ రామ్ పటాస్ నాగచైతన్య దోచేయ్ ల్లో 3 సినిమాల్లో మూడు సినిమాలు మాత్రమే విడుదలయ్యే అవకాశాలున్నాయని టాక్. ఏమైనా సంక్రాంతి సెంటిమెంట్ కారణంగా ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంగానే చేస్తున్నారు. ఇంకో రెండు వారాలు గడిస్తేగానీ ఖచ్చితంగా ఏవి విడుదలకు సిద్ధమవుతున్నాయనేది పూర్తిగా తెలుస్తుంది.