నటుడు సాయి కుమార్ తనయుడు, తెలుగు యువహీరో ఆది వివాహం శనివారం వైభవంగా జరిగింది. రాజమండ్రికి చెందిన అమ్మాయి అరుణ మెడలో మూడుముళ్ల వేశాడు. హైదరాబాదులో జరిగిన ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, బంధువులు, సినీ పరిశ్రమ నుంచి అతికొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. శనివారం సాయంత్రమే గచ్చిబౌలిలో వివాహ రిసెప్షన్ జరుగుతుంది. ఇక్కడికీ సినీ ప్రముఖులంతా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.