పాత్రలో కనిపిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే కాస్త సస్పెన్స్, కామెడీ జోడించిన కథగా కనిపిస్తోంది ‘ధనలక్ష్మి తలుపు తడితే'. మనోజ్ నందం, ధన్‌రాజ్, శ్రీముఖి, సింధు తులాని, రణధీర్, ప్రధాన తారాగణంగా భీమవరం టాకీస్ పతాకంపై సాయి అచ్యుత చిన్నారి దర్శకత్వంలో తుమ్మల రామసత్యనారాయణ రూపొందించిన చిత్రమిది. నిర్మాతగా మారిన కమెడియన్ ధనరాజ్ లైఫ్ స్టోరీ సినిమా గురించి నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ, సినిమా కథ బాగా కుదరడంతో బడ్జెట్‌ను ముందుగానే నిర్ణయించుకుని పక్కా ప్రణాళికతో ఈ సినిమాను తీర్చిదిద్దామని, చిన్న సినిమాగా మొదలుపెట్టినా క్వాలిటీ విషయంలో పెద్ద చిత్రంగానే రూపొందిందని, దర్శకుడికి మొదటి చిత్రమైనా అనుభవమున్న వ్యక్తిలా చిత్రీకరించారని తెలిపారు. ఈ దర్శకుడితో ‘సచ్చినోడి ప్రేమకథ' అనే చిత్రాన్ని మొదలుపెట్టినా, అనివార్య కారణాలవల్ల ఆ చిత్రాన్ని వదిలి ఈ చిత్రాన్ని చేశామని, కథ నచ్చి ఈ సినిమాకు భాగస్థుడిగా మారానని, కథే హీరోగా ఉంటుందని ధన్‌రాజ్ తెలిపారు. దర్శకుడు సాయి అచ్యుత్ చిన్నారి మాట్లాడుతూ, తొలిసినిమా అనుకోకుండా ఓ బాధ్యతతో రూపొందించానని, సినిమా చూసిన ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుందని, సంగీతం బాగుంటుందని తెలిపారు. అనీల్ కల్యాణ్, విజయ్‌సాయి, నాగబాబు, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:జి.శివకుమార్, ఎడిటింగ్:శివ వై.ప్రసాద్, నిర్మాత:తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సాయి అచ్యుత్ చిన్నారి.