సోషల్ మీడియాలో మరో బుజ్జోడు హల్ చల్....

May 27, 2015 | 01:06 PM | 44 Views
ప్రింట్ కామెంట్
rithesh_jeniliya_niharonline

ఈ మధ్య సోషల్ మీడియాలో బుజ్జాయిల ఫొటోలు నెటిజన్లను ఆనందంలో ముంచేస్తున్నాయి. సాధారణంగా ఏ పిల్లల ఫొటోలు చూసినా... ముద్దొచ్చి కాపీ చేసి పెట్టుకుంటాం... అలాంటిది సెలబ్రిటీల పిల్లల్ని మరింత ఆసక్తిగా చూస్తాం కదా... అల్లు అర్జున్ తనయుడు అయాన్ తో మొదలైన బుజ్జాయిల పరంపర... మంచులక్ష్మి నిర్వాణ,... లేటెస్ట్ గా ఎన్టీఆర్ తనయుడు అభిరామ్... నెటిజన్లను ఆనందంలో ముంచేశారు. ఇప్పడు కొత్తగా జెనీలియా-రితీష్ ల తనయుడు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. రితేష్ దేశ ముఖ్ తన ముద్దుల తనయుడు రియాన్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరు నెలల ఈ బుడతడు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌లు 2014 నవంబర్ లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. పుత్రోత్సాహంతో  ఉన్న ఈ జంట ఎప్పటికప్పుడు బుజ్జాయి వార్తలను ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా అబిమానులతో షేర్ చేసుకుంటున్నారు. రియాన్ పుట్టినప్పటి ఫొటోలను కూడా రితేష్ సోషల్ మీడియాలో పోస్టు చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ