నటన కంటే డైరక్షనే ఇష్టం

November 24, 2014 | 11:27 AM | 35 Views
ప్రింట్ కామెంట్

తనకు నటించడం కన్నా మెగా ఫోన్ పట్టకుని దర్శకత్వం వహించటం అంటేనే ఎక్కువ ఇష్టం అంటోంది హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ. 'నాకు నటించడమంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కెమెరా ముందు ఎప్పుడూ నిలబడాలన్నా అసౌకర్యంగా ఫీలయ్యేదాన్ని. ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెడతా. దర్శకత్వ శాఖలో కూడా రాణిస్తానని ఆశిస్తున్నా' అని స్పష్టం చేసింది. ఇక ఈ విషయంలో తన భర్త బ్రాడ్ పిట్ కూడా పూర్తి మద్ధతు నిస్తున్నాడని చెప్పుకొచ్చింది. చివరిసారిగా ఏంజిలీనా 'మేల్ ఫీసెంట్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. గత మే నెల్లో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. అయితే ఈ వ్యాఖ్యలతో జోలీ నటనకు గుడ్ బై చెప్పనుందా? అని హాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక నుంచి ఆమె దృష్టి దర్శకత్వం వైపు మళ్లిందని, దీనికి సంబంధించి నైపుణ్యం కోసం ప్రముఖ దర్శకులతో ఏంజెలీనా చర్చలు జరుపుతుందని సమాచారం. అందుకే ఇంత గ్యాప్ తీసుకుంటుందట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ