జూనియర్ సుకుమార్ సినిమా త్వరలో షురూ...

December 11, 2014 | 02:42 PM | 44 Views
ప్రింట్ కామెంట్

వన్ సినిమా ఫ్లాప్ తో నిరాశకు గురైన సుకుమార్ ఈసారి మాంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే తన చేతిలో ఉన్న మంచి కథను ఎన్టీఆర్ తో తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. కథ ఎప్పుడో సిద్ధంగా ఉన్నా ఎన్టీఆర్ షూటింగ్ లతో బుజీగా ఉండడం, అందులో కథ కూడా సవరించమని అడగడంతో సుకుమార్ ఇంత కాలం ఆగాల్సి వచ్చింది. నిజానికి ఇది టెంపర్ కంటే ముందుగా మొదలవ్వాల్సిన సినిమా. ఇప్పుడు స్క్రిప్ట్ చూసిన ఎన్టీ ఆర్ సంత్రుప్తి వ్యక్తం చేసినట్టు సినిమా ఎప్పుడు మొదలయ్యేది కూడా అనుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ఈ నెలాఖరులో కొబ్బరికాయ కొట్టనున్నట్టు కూడా చర్చించుకుంటున్నారు. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైన్ సినిమాగా అనుకుంటున్నారు. ఈ చిత్రానికి బీ.వీ.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ఎవరనేది ఇంకా బయటికి రాలేదు. బాలీవుడ్ భామనే అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఎక్కువగా అపజయాలనే చవి చూసిన ఎన్టీఆర్ కూడా సినిమాల విషయంలో ఆచీతూచీ అడుగులేస్తూ, సక్సెస్ ఇచ్చే దిశలో తనుకూడా క్రుషి చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ