పెళ్ళిలో సందడి చేసిన కళ్యాణ్-ఎన్టీఆర్

June 06, 2015 | 04:37 PM | 1 Views
ప్రింట్ కామెంట్
ntr_kalyan_ram_in_sisters_marriage_niharonline

నందమూరి వారింట్లో జరిగిన ఓ పెళ్ళిలో ఈ అన్నదమ్ములిద్దరూ మొదటి సారిగా కలిసి సందడి చేశారు. ఇంతకు ముందెన్నెడూ ఎన్టీఆర్ ఇలా ఫామిలీ పెళ్ళిళ్ళలో కనిపించడం బహు అరుదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవరాలు, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల సోదరి(బాబాయ్ కూతురు) దేవయాని వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్ళి లో మీడియాను దూరంగా ఉంచారు.  బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే ఈ పెళ్ళి వైభవంగా జరిగింది. పెళ్ళిలో ఈ హీరోలిద్దరూ  కలిసి సరదాగా సందడి చేశారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు దగ్గరుండి మరీ అన్ని పనులూ చూసుకున్నారు. నందమూరి వారి ఆడపడుచు కావడంతో ఈ అన్నయ్యలిద్దరూ చాలా హడావుడి చేశారట. ఈ పెళ్ళిలో పురందరేశ్వరి కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారని తెలుస్తోంది. ​

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ