ప్రస్తుతం శ్రీమంతుడు చిత్రంతో బిజీగా ఉన్న మహేష్ బాబు మే31న బ్రహ్మోత్సవం చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జూలై 10నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారు. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీతలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పివిపి బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇది వర్కవుట్ అయితే మహేష్ చేసిన తొలి తమిళ సినిమా ఇదే అవుతుంది.