ఐదు పదుల వయస్సులో కూడా అమ్మాయిలకు కలల రాకుమారుడిగా చెలామణి అయ్యే ఏకైక అర్హత టాలీవుడ్ కింగ్ నాగార్జునదే. సినిమా సినిమాకు కుర్రాడైపోతున్న ఇతగాడిని చూసి బాగా ఎక్సయిటయిందట నటి లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం నాగ్ ద్విపాత్రాభినయంలో నటిస్తు కళ్యాణ్ అనే కొత్త వ్యక్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో లావణ్య ఒక కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలె ప్రారంభమయ్యిందన్న సంగతి తెలిసిందే. తొలిరోజు షూటింగ్ సమయంలో నాగ్ ను చూడగానే మైమరిచిపోయిందట, అంతేకాదు అప్పటిదాకా బట్టిపట్టిన డైలాగులన్నీ మరిచిపోయిందట. వెంటనే నాగ్ జోక్యం చేసుకొని ఈ అమ్మడికి ధైర్యం చెప్పారట. దాంతో కొలుకొని డైలాగులు చెప్పడం పూర్తిచేసిందట. అంతేకాదు ఆన్ స్క్రీన్ పై చాలా అందంగా ఉంటావని నాగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడని ట్విట్టర్ పేర్కొని తెగ మురిసిపోతుంది ఈ అందాల రాక్షసి.