కుటుంబ కథా చిత్రమంటూ తీసిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాకు రేటింగ్ పెద్దగా రాలేదు. సినిమాను ప్రమోట్ చేయడానికి మీడియా ముందుకు వచ్చిన అవిక కామెంట్లు ఇప్పడు పెద్ద టాపిక్ అయి కూర్చున్నాయి. ఈ కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలు కాస్త పక్కదారి పట్టాయి. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి పాత్రలను మాత్రమే చేశారు. గ్లామర్ పాత్రలలో ఎప్పుడూ నటిస్తారు అని అడిగిన ప్రశ్నకు అవిక సమాధానం ఇస్తూ... తనను తెలుగు ప్రేక్షకులు పక్కింటి అమ్మాయిగా, ఒక సోదరిగా భావిస్తున్నారు కాబట్టి తాను హాట్ లుక్స్ లో కనిపించే ఎటువంటి పాత్రలో నటించను అని చెప్పేసింది. అంతేకాదు మరో అడుగు ముందుకు వేసి అటువంటి అసభ్యతతో కూడిన పాత్రలో పవన్ కళ్యాణ్, అమితాబ్ సినిమాలలో అవకాశం వచ్చినా చేయనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతే కాదు తనకు శ్రీదేవి నటించిన ‘వసంత కోకిల’ లాంటి సినిమా చేయాలని ఉందని చెప్పింది. ఇంత ఖరాఖండిగా చెప్పిన అవికను అభినందించాల్సిందే మరి. ఎవరి అభిప్రాయం వారిది. ఆమెకు అలాంటి పాత్రలే చేయాలని ఉందేమో... ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు.