ప్రియాంకను అద్రుష్టం మళ్లీ వరించింది. తాజాగా ఈ బ్యూటీ ప్రపంచ ఆసియా శృంగార దేవతగా ఎన్నికైంది. లండన్‌లో గురువారం జరిగిన పోటీల్లో గతేడాది విజేత కత్రినాకైఫ్‌ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని లాగేసుకుంది. యూకే వీక్లీ న్యూస్ పేపర్ 'ఈస్ట్రన్ ఐ' నిర్వహించిన ఈ కాంటెస్ట్‌లో 50 మంది భామలను నెట్టేసి ఫస్ట్ ప్లేస్‌లో ప్రియాంక నిలిచింది. ‘మేరీకామ్’, ‘గూండే’ సినిమాలు తప్ప 2014లో ఈ అమ్మడి చేతిలో పెద్దగా మూవీల్లేవు. ఇదిలావుండగా పాపులర్ టీవీ నటి ద్రష్థి ధామి రెండో స్థానానికి పరిమితమైంది. గతేడాది నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచిన కత్రినా, ఈసారి మాత్రం నాలుగో స్థానానికి పడిపోయింది. ఒకవిధంగా కత్రినా కైఫ్‌ను ఈ పోటీ నిరాశకు గురిచేసింది. బాలీవుడ్‌లో కత్రినా పని అయిపోయినట్టేనని ఇండస్ర్టీలో చర్చించుకుంటున్నారు.