చిత్రాలలో ఐటెం సాంగ్ లలో నటించే వారిని వేశ్యలుగా ప్రకటించాలని అఖిల భారతాయ హిందూ మహాసభ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసేందే. ఐటెం సాంగ్ లలో వారి వస్రధారణ మూలంగానే దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని, ఈ విషయమై దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని వారు ప్రకటించారు. అయితే ఇప్పుడీ వ్యాఖ్యలపై ప్రియాంక చోప్రా స్పందించింది. వారివసలు అర్థం పర్థం లేని మాటలు. ఇప్పుడు వారు అమ్మాయిల్లాగా సున్నితంగా మాట్లాడుతున్నారు. కాబట్టి వారిప్పుడు స్కర్ట్ లు వేసుకునేలా ఆదేశించాలని నేను కూడా కోర్టును ఆశ్రయిస్తాను. మహిళల పురొగతి కి సాయపడాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలతో మరింత వెనక్కి లాగుతున్నారు. స్కర్ట్ లు వేసుకుంటేనో, వస్ర్తధారణతోనే రేప్ లు జరుగుతాయనడం మూర్ఖ్కత్వం అంటూ ఘాటుగా స్పందించింది.