జూనియర్ ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి నేనోరకం, రుబాబు అనే రకరకాల పేర్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆఖరికి ఈ చిత్రానికి ‘టెంపర్’ అనే పేరును ఫైనలైజ్ చేశారట. అంతేకాదు నిర్మాత బండ్ల గణేశ్ ఈ పేరుతోనే చిత్రం పేరును రిజిస్ట్రర్ చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్లో దరఖాస్తు పెట్టుకున్నాడట. ఆంధ్రావాలా తర్వాత తమ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రానికి పూరి సొంత కథ(పైత్యాన్ని)ను పక్కనబెట్టి వక్కంతం వంశీచే కథను తయారుచేయించాడట. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ తో జతకడుతుంది. ఇక సినిమాలో తరుచు ‘పోకిరి’ వేశాలేషే ఎన్టీఆర్ ను ఈ చిత్రంలో మాత్రం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపేందుకు పూరి ప్రయత్నిస్తున్నాడట. ప్రస్తుతం గోవాలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత బండ్ల గణేశ్ ప్రయత్నిస్తున్నాడు.