ముందు ప్రిన్స్... ఆ తరువాతే మెగా ప్రిన్స్

December 11, 2014 | 04:04 PM | 58 Views
ప్రింట్ కామెంట్

నటించింది ఒక్క సినిమాలో అయినా, అది ఇంకా విడుదల కాకపోయినా,మెగా ఫ్యామిలీ కుర్రాడు అప్పుడే మెగా ప్రిన్స్ అయిపోయాడు. ఈ అందగాడితో త్వరలో పూరీ జగన్నాధ్ సినిమా తీయబోతున్నాడని టాక్. పూరీ జగన్నాథ్ లాంటి అగ్ర దర్శకుడితో వరుణ్ తేజకు అవకాశం రావడం అంటే అతని ఎదుగుదలకు గట్టి పునాది పడినట్టే అనుకోవచ్చునేమో. అయితే టెంపర్ సినిమాతో బిజీగా ఉన్న పూరీ జగన్నాథ్ తరువాత సినిమా ప్రిన్స్ మహేష్ బాబుతోనే అనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఆ తరువాతే వరుణ్ తేజతోనే సినిమా అని డిసైడ్ అయ్యాడట. ఈ చిత్రానికి సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడట. త్వరత్వరగా సినిమాలు ముగించుకునే పూరీ జగన్నాథ్ కు వరుణ్ సినిమా మొదలవడానికి పెద్దగా సమయం తీసుకోకపోవచ్చునని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఈ మెగాప్రిన్స్ ఫాలోయింగ్ మొదలైపోయింది. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలను ఇట్టే ఆకర్షించేశాడు వరుణ్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ