బబ్లీ హీరోయిన్ కు బంఫర్ ఆఫర్

December 13, 2014 | 05:46 PM | 94 Views
ప్రింట్ కామెంట్

సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా బెంగాల్ టైగర్ అనే చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా మిల్కీబ్యూటీ తమన్నను కూడా ఎంపికచేశారు. అయితే ఇప్పుడీ చిత్రంలో మరో హీరోయిన్ గా రాశిఖన్నా ఎంపికయ్యింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బబ్లీ హీరోయిన్ రాశి ఖన్నా ప్రస్తుతం హీరోలకు హట్ ఫేవరెట్ గా మారిపోయి వరుస చిత్రాలలో నటించేస్తుంది. తన అందంతో నటనతో చిన్న సినిమాల్లో నటించి భారీ క్రేజును సంపాదించుకున్న రాశిఖన్నా... ఇపుడు ఏకంగా మాస్ మహరాజ్ తో నటించే అవకాశం దక్కడంతో తెగ సంబరపడిపోతుంది. అయితే ఈ ఎంపికలో రవితేజ హ్యండ్ ఉన్నట్లు తెలుస్తోంది. కుర్రహీరోయిన్లతో ఆడిపాడితేనే జనాలు ఎంజాయ్ చేస్తున్నారని పసిగట్టిన రవితేజ హీరోయిన్ గా రాశిఖన్నాను ఎంపికచేయాలని నిర్మాతలకు సూచించాడట. రవితేజ ప్రస్తుతం కిక్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమా జనవరిలో పూర్తి కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బెంగాల్ టైగర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ