ఎయిడ్స్ తో మరణశయ్యపై సెక్సీ నటి

December 06, 2014 | 05:31 PM | 1114 Views
ప్రింట్ కామెంట్

ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటీనటులు అవసాన దశలో పట్టించుకునే నాథులు లేక దుర్భర పరిస్థితుల్లో చనిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. సినిమాల్లో తమ నటన ద్వారా విశేష అభిమానులను సంపాదించుకున్న వీరు నిత్య జీవితంలో మాత్రం సొంత వారి ఆదరణకు కూడా నోచుకోక తనువు చాలిస్తున్నారు. అలాంటిదే ఇప్పుడోక వార్త సంచలనం దక్షిణాది చలన చిత్ర పరిశ్రమను విస్తుపోయేలా చేసింది. మూడు దశాబ్దాల క్రితం కాలీవుడ్ లో తన అందాలతో జనాల్ని పిచ్చెక్కిచ్చిన నటి నిషా గురించి తట్టుకోలేని న్యూస్ ఒకటి ఇప్పడు తెలిసింది. ఆమె ఎయిడ్స్ తో భాదపడుతూ మంచాన పట్టి ఉన్న ఫోటోలు సోషల్ వెబ్ సైట్లలో దర్శనమిస్తున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్‌లాంటి బడా స్టార్స్ తో నటించిన నిషా ఎయిడ్స్ కోరల్లో చిక్కుకొని మరణపు అంచున ఉన్న ఫోటోలను చూసి తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. ఒకప్పుడు తన అందంతో కుర్రకారుకి మత్తెక్కించిన నిషా ఆరోగ్యం పూర్తిగి క్షీణించి అస్థిపంజరం లాంటి శరీరంతో సొంత గ్రామం నాగపట్టణం జిల్లాలోని నాచూర్ గ్రామంలోని నాబూర్ దర్గా వద్ద అనాథలా పడిఉంది. బికీనితో అలరించిన ఈ అందగత్తె మేని పై ఇప్పుడు ఈగలు, చీమలు పారుతుండటం చూసి ప్రతిఒక్కరు పాపం అనుకుంటున్నారే తప్ప సాయం చేయడానికి ముందుకు రావటం లేదు. బాలచంద్రన్, విసు, చంద్రశేఖర్‌ వంటి ప్రముఖుల దర్శకత్వంలో ఆమె నటించారు. కమలహాసన్ సరసన టిక్ టిక్ టిక్ చిత్రంలోను, రజనీకాంత్‌తో రాఘవేంద్ర చిత్రంలోను నటించారు. ఇంకా కల్యాణ అగధిగళ్, మయిలుక్కు మూనుకాల్ మొదలగు పలు చిత్రాలలో కథా నాయకిగా నటించారు. వాట్సాప్ ద్వారా ఈ దృశ్యాలు చూసిన జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడు మురుగేశన్ వెంటనే స్పందించారు. 30 ఏళ్ల క్రితం ఓ వెలుగు వెలిగిన ఓ నటికి ఇంత దారుణమైన పరిస్థితి ఏంటని కలత చెందారు. అంతేకాదు. నిషాకు వెంటనే వైద్య చికిత్సలకు ఏర్పాటు చేయాల్సిందిగా నాగపట్టణం జిల్లా కలెక్టర్‌ని, పోలీసు సూపరింటెండెంట్ ని ఆదేశించారు. ఆమె ఆరోగ్య వివరాలను నాలుగు వారాల్లోగా అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ