వరుస హిట్లతో జోరు మీదున్న కుర్రహీరోలు తమ హ్యట్రిక్ కలను నెరవేర్చుకోలేకపోయారు. ఈ శుక్రవారం రిలీజైన వీరిద్ధరి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. వారే సుమంత్ అశ్విన్, నాగ శౌర్య. ఇందులో ముందుగా సుమంత్ అశ్విన్ గురించి. నిర్మాత యంఎస్ రాజు తనయుడిగా తండ్రి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తూనీగ తూనీగ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. చిత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అంతకుముందు ఆ తర్వాత, లవర్స్ చిత్రాలతో వరుసగా రెండు హిట్లు అందుకున్నాడు. ఇక హ్యట్రిక్ కోసం ఇప్పుడు చక్కిలిగింత చిత్రంతో ముందుకు వచ్చాడు. అయితే కథలో కంటెంట్ మిస్సవ్వడంతో ప్రేక్షకులు చిత్రాన్ని తిరస్కరించారని చెప్పాలి. ఇక మరో హీరో నాగ శౌర్య. మొదటి చిత్రం చందమామ కథలు అంతంత మాత్రంగా ఆడింది. పూర్తి విడివి హీరోగా చేసిన ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య చిత్రాలు వరుస హిట్లను అందించాయి. ఇక శౌర్య హ్యట్రిక్ కోసం చేసిన ప్రయత్నమే లక్ష్మీ రావే మా ఇంటికి. కథ సేమ్ ఎక్కడో చూసిన ఫీలింగ్ రావడం, సెకండాఫ్ చిరాకు పుట్టించడంతో ఇది కూడా ప్రేక్షకులతో చేదు గుళికనే మింగించింది. దీంతో హ్యట్రిక్ కొట్టాలన్న ఈ ఇద్దరి కుర్రహీరోల కలను ఈ చిత్రాలు ముంచేశాయి.