ఈ పోర్న్ బేబీ సన్నీ లియోని ఆహ్వానించడమేమిటి? తమ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసుకొని లాభాలను ఆర్జించడమేమిటి? ఇప్పుడు ఆమెను దేశం విడిచి పొమ్మంటూ... రచ్చ రచ్చ చేయడమెందుకో? ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడు ఇండస్ట్రీలో కొంత మంది తారలు ఈమె మీద మండి పడుతున్నారు. ఇక హీరోలా భార్యలు కూడా అభద్రతా భావానికి గురవుతున్నారు. సన్నీ లియోన్ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. ఒకప్పుడు అశ్లీల చిత్రాల్లో నటించిన భామ కావడంతో మొదట్లో ఆమె ఇండియాలో అడుగు పెట్టిన వెంటనే కొందరు ఆందోళన కూడా చేశారట. ఆమెను ఇండియన్ సినిమాల్లో నటించనివ్వొద్దు అని డిమాండ్ చేశారు. అప్పట్లో ఈమెతో నటించడానికి బాలీవుడ్ స్టార్లు భయపడ్డారు. అయితే. సన్నీ లియోన్ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించడం, అవి మంచి విజయం సాధించడం, ఆమె చిత్రాలకు మంచి మార్కెట్ ఏర్పడడంతో పరిస్థితుల్లో కొద్దికొద్దిగా మార్పు వస్తోంది. సన్నీ లియోన్ తో కలిసి పని చేయడానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే, సన్నీ లియోన్ కలిసి సినిమా చేయడం అంటే సదరు బాలీవుడ్ స్టార్ల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ అభద్రత భావానికి గురవుతున్నరని ఓ టాక్ నడుస్తోంది. కానీ కారణం దీని కన్నా బలమైనది మరేదో ఉండవచ్చుననిపిస్తోంది. తమ ఛాన్సులు లాక్కుంటుందన్న అక్కసుతో ఈమెను ఇలా చేస్తున్నారేమో అన ఒక టాక్ కూడా ఉంది. కానీ బయటికి వస్తున్న వార్తల్ని బట్టి సన్నీ లియోన్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ‘నాతో పాటు కలిసి పని చేస్తున్న యాక్టర్లలో చాలా మంది పెళ్లయిన వారే. వారు నాతో పని చయడం వల్ల ఇన్ సెక్యూర్ ఫీలింగుకు గురవుతున్నట్లు గమనించాను. వారి భర్తలు లేదా బాయ్ ఫ్రెండ్స్ ను నేనేమీ సొంతం చేసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే మోస్ట్ అమేజింగ్ హస్బెండ్ నాకు ఉన్నారు' అని సన్నీ లియోన్ చెపుతోంది.