నంది అవార్డులకు టీ సర్కార్ ఓకే కానీ...

February 12, 2016 | 11:12 AM | 2 Views
ప్రింట్ కామెంట్
talasani-clarity-on-nandi-awards-niharonline

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలుగు సినీ రంగం సంక్షోభం లేకుండా సాఫీగానే సాగిపోతుంది. ప్రభుత్వ సహకారం, ఇండస్ట్రీ పెద్దల పరస్పర ఒప్పందంతోనే టాలీవుడ్ హైదరాబాద్ ను వీడిపోవాల్సిన అవసరం లేకుండా వచ్చింది. అయితే ప్రతిష్టాత్మక నంది అవార్డుల విషయంలో మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. ఇరు ప్రభుత్వాలు ఇస్తాయా ఇవ్వవా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఓ స్పష్టత మాత్రం వచ్చిందండోయ్.

2011 నుంచి నంది అవార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ కూడా వేసింది. తెలంగాణ చిత్ర పరిశ్రమను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై మంత్రులు తలసాని, కెటిఆర్, తమ్మినేనితో కూడిన బృందం సీనియర్ సినీ ప్రముఖులతో సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ భేటీలో దాసరి నారాయణ రావు, రాజేంద్రప్రసాద్, సురేష్ కుమార్, అశోక్ కుమార్, కెఎస్ రామారావు, ఆర్.నారాయణ మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే నంది అవార్డులిచ్చే విషయంపై స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు. కానీ, నంది అవార్డు పేరు ఖచ్ఛితంగా మార్చి తీరుతామని ప్రకటించారు.

                         అలాగే సినిమా షూటింగ్ లను సింగిల్ విండో పద్ధతిలో అనుమతులిస్తామన్నారు. చిత్ర పురి కాలనీని మరింత మెరుగు పరుస్తామన్నారు. అంతే కాకుండా మౌలిక వసతులు కల్పిస్తూ 10 వేల మందికి కొత్తగా ఇళ్లు కట్టిస్తామన్నారు. అలాగే థియేటర్లలో 5 షోల ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నామన్నారు. థియేటర్ల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేస్తామన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ