టెంపర్ తగ్గలేదంట

December 10, 2014 | 11:05 AM | 35 Views
ప్రింట్ కామెంట్

టెంపర్ షూటింగ్ వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలన్నీ ఉత్తవే అని ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న టెంపర్ చిత్రం షూటింగ్ ఈ రోజు నుంచి తిరిగి హైదరాబాదులో కొనసాగుతుంది. సోదరుడు జానకీరాం మరణంతో బాధలో వున్న ఎన్టీఆర్ ఈ షూటింగును పది రోజుల పాటు వాయిదా వేసుకున్నాడంటూ నిన్న వార్తలొచ్చిన సంగతి విదితమే. అయితే, వాటిలో వాస్తవం లేదనీ, షెడ్యూల్ ప్రకారం షూటింగ్ ఈ రోజు నుంచి జరుగుతుందనీ నిర్మాత వర్గాలు చెబుతున్నాయి. జనవరి 9న దీనిని రిలీజ్ చేయాలంటే షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సి వుంది. అందుకే, ముందు అనుకున్నట్టుగానే నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ