థమన్ మరీ హాలీవుడ్ కాపీ ఏంటయ్యా!

February 19, 2016 | 04:03 PM | 1 Views
ప్రింట్ కామెంట్
thaman-sarainodu-BGM-copied-transformers-3-niharonline

సంగీత దర్శకుడు థమన్ ప్రతిభ గురించి మనందరికీ తెలసిందే. అడపాదడపా తప్ప అతను తనే మ్యూజిక్ నే తిప్పి తిప్పి కొట్టిన సందర్భాలు అనేకం. భాషల కతీకతంగా సొంత ట్యూన్సేనే చాలా సార్లు అతను కాపీ చేశాడు. స్టార్ హీరోలకు అని కూడా చూడకుండా జెన్యూన్ ట్యూన్స్ కొట్టడం కూడా మానేశాడంటే థమన్ ఎంతకు దిగజారిపోయాడో అర్థం చేసుకోవచ్చు. ఒక్కోసారి కర్ణోకఠోరమైన సౌండ్లతో పిచ్చెక్కించే థమన్ మెలోడీ అంటే చాలా కష్టమనే చెబుతుంటాడు. ఇక లోకల్ ట్యూన్స్ అయిపోయాయనేమో ఏమో హాలీవుడ్ ట్యూన్స్ పై పడిపోయాడు.

అల్లు అర్జున్-బోయపాటి కాంబినేషన్లో సరైనోడు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టీజర్ ఇటీవలె రిలీజయి ప్రభంజనం సృష్టిస్తోంది. మాస్ సినిమా రుచికి దూరమై ఉన్న మెగా ఫ్యాన్స్ కి టీజర్ తో ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడనే సంకేతాలు అందించాడు బన్నీ. ఆదిపినిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక బన్నీ లుక్ కూడా టోటల్ గా మారిపోయింది. ఎర్రతోలు చూసి సాప్ట్ అనుకుంటున్నారేమో పక్కా మాస్ అన్న డైలాగుతో సినిమాలో యాక్షన్ పాలు ఏపాటిదో చెప్పేశాడు బన్నీ.

ఇక అసలు విషయానికొస్తే థమన్ కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి. ఇది వరకు స్పానిష్, బెల్జియం మ్యూజిక్ లు కాపీ కొట్టిన థమన్, ఇప్పుడు ఏకంగా ఓ హాలీవుడ్ చిత్ర బ్యాగ్రౌండ్ స్కోర్ ను వాడేశాడు. ట్రాన్స్ ఫార్మర్స్-3, డార్క్ ఆఫ్ ది మూన్ చిత్ర బ్యాగ్రౌండ్ ను యాజ్ టీజ్ గా దించిపడేశాడు థమన్. ఏదో ముక్కు మొహం తెలీని చిత్రం అంటే ఓకేగానీ, మరి పాపులర్ చిత్రాల నుంచి కాపీ చేస్తే కష్టం సామీ! ఈ టీజర్, ఆ ట్రైలర్ మాములుగా గమనించినా మీకు తెలిసిపోతుంది అసలు విషయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ