సంగీత రారాజు 72వ జన్మదినం నేడు...

June 02, 2015 | 05:37 PM | 0 Views
ప్రింట్ కామెంట్
ilaya_raja_72_birth_day_niharonline

ప్రతి సంగీతాభిమాని గౌరవించే వ్యక్తి, సినీ సంగీతంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా పుట్టిన రోజు నేడు. (జూన్ 2 ). ఆయన సంగీతం వింటూ ఎన్ని గంటలైనా మనని మనం మైమరచి పోవచ్చు. ఎంతో వినసొంపైన స్వరాలను ఏరి కూర్చి బాణీలు కట్టే మ్యూజిక్ మ్యాస్ట్రో పద్మభూషన్ ఇళయరాజా. ఆయన ఈ రోజుతో 72వ ఏట అడుగుపెడుతున్నారు. స్వతహాగా నిరాండంబరుడైన ఇళయరాజా ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటారు. 1943, జూన్ 2న  తమిళనాడులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు ఇళయ రాజా. పేద కుటుంబంలో పుట్టినా ఇప్పుడు ఆయన భారతదేశ సంగీత దర్శకుల్లో ప్రముఖుడు. 1976లో విడుదలైన జయప్రద సినిమా 'భద్రకాళి'లో ‘చిన్ని చిన్ని కన్నయ్య’ అనే పాటకు సంగీతం అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాకు పరిచయమయ్యారు.  తన స్వరాన్ని కూలీ నెం.1 లో ‘కలయా నిజమా’ అనే మధురమైన పాట ద్వారా వినిపించారు. భద్రకాళి మొదటి సినిమా అయినప్పటికీ ఎన్టీఆర్‌ 'యుగంధర్‌' మొదట విడుదలైంది. సంగీతానికి పాశ్చాత్య సంగీతం కూడా మేళవిస్తూ చక్కని బాణీలు కూర్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఈయన నలభై ఏళ్ళుగా సినీ సంగీత ప్రపంచంలో ఎన్నో మధురమైన పాటలను అందించి మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అండుకున్నారు.  2004లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంగీత స్వర రాజుకు నీహార్ ఆన్ లైన్ పుట్టిన రోజు శుభాకాంక్షలను అందిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ