వరుణ్ సందేశ్ కి హ్యపీడేస్ లేక చాలా రోజులైంది. అసలు సినిమాలు ఎలా వస్తున్నాయో ఎలా పోతున్నాయో కూడా జనాలకు తెలీదు. వరుణ్ సందేశ్ ది ఫలానా సినిమా అంటే... అవునా? అదెప్పుడొచ్చింది అని ప్రేక్షకులు అనుకునే స్టేజికి మనోడు దిగజారిపోయాడంటే అర్థం చేసుకొచ్చు. ఇక రీసెంట్ గా మనోడు హీరోగా ‘ఈ వర్షం సాక్షిగా’ అనే చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రం అడియో ఇటీవల విడుదలైంది లేండి. ఇక చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించేశారు. అయితే 12 న ఏముందో తెలిసికూడా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారంటే నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అదే సూపర్ స్టార్ రజనీకాంత్ లింగా చిత్రం విడుదల అవుతుంది కదా. తలైవా దెబ్బకు బడాబడా హీరోలే తమ చిత్రాలను ప్యాక్ చేసుకొని పెట్టెలో పెట్టుకున్నారు. లింగా హవా ఎప్పుడయితే తగ్గుతుందో తీరిగ్గా అప్పుడే రిలీజ్ చేద్దామని వారంతా డిసైడ్ అయ్యారు. మరి హరిప్రియ అందాల ఆరబోతతో నడిపిద్దేమనుకుంటున్న ఈ పొట్టేలు సినిమాకు ముందు ఉన్న లింగా అనే కొండ కనిపించట్లేదో ఏమో మరి.