కొత్త కుర్రాడు చించడం ఖాయమట

December 13, 2014 | 11:11 AM | 39 Views
ప్రింట్ కామెంట్

ఆరంభం నుంచే మెగా ఫ్యామిలీ అప్ కమింగ్ హీరో వరుణ్ తేజ్ ఇండస్ట్రీకి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ప్రిన్స్ తర్వాత ఆస్థాయి రేంజ్ లో అందగాడిగా ఉన్నాడని అల్రెడీ ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంటున్నాడీ మెగా ప్రిన్స్. ఇక ఈ చిత్ర లేటేస్ట్ ట్రైలర్ ఇటీవల విడుదలయ్యింది. ఇందులో వరుణ్ మాస్ అప్పీరియన్స్ తో ఫైట్స్, డాన్సులు ఇరగదీశాడు. అలాగే కొన్ని సీన్లలో క్లాస్ అప్పీరియన్స్ తో కూడా కనువిందు చేశాడు. ఇక ఇది చూసిన వారంతా వరుణ్ ఖచ్చితంగా టోటల్ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు మరీ ముఖ్యంగా మెగా కాంపౌండ్ లోని హీరోలకు కూడా ఖచ్చితంగా పోటీఅవుతాడని చెబుతున్నారు. ట్రైటర్ లో కుర్రోలం కదా ఉడుకురక్తం అని రావు రమేష్ తో చెబుతున్న డైలాగ్ చూస్తూంటే పేలడానికి రెడీగా ఉన్న డైనమైట్ లా వరుణ్ కనిపిస్తున్నాడు. డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల మనోడిలోని ఫైర్ ని మొత్తం ఫుల్ గా వాడుకున్నట్టు అనిపిస్తోంది. ఇవన్నీ చూస్తూంటే మొదటి చిత్రంతో వరుణ్ తేజ్ సెన్సెషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోందని ఫిలింనగర్ టాక్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ