క్రికెట్ దేవుడి రికార్డుపైనే కన్నేశాడు

May 19, 2016 | 04:14 PM | 2 Views
ప్రింట్ కామెంట్
alistair_cook_sachin_tendulkar_niharonline

ప్రపంచానికే క్రికెట్ నేర్పించిన దేశమైనప్పటికీ ఇప్పటివరకూ ఏ ఒక్క ఇంగ్లీష్ ఆటగాడికి ప్రపంచ రికార్డులు బద్ధలు కొట్టే సీన్ మాత్రం ఇంకా రాలేదు. అంతేందుకు ఆఖరికి టెస్టుల్లో పదివేల పరుగుల ఫీట్ కూడా ఇంతవరకు సాధ్యపడలేదు. అయితే ఓ ఇంగ్లండ్ క్రికెటర్ మాత్రం ఏకంగా క్రికెట్ దేవుడు సచిన్ రికార్డుపైనే కన్నేశాడు. అలిస్టర్ కుక్ అతి తక్కువ వయసులో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్. దశాబ్దాలుగా తమ జట్టు ఆటగాళ్లకు సాధ్యంకాని అరుదైన ఫీట్ అందుకోవడానికి ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ కేవలం 36 పరుగుల దూరంలో ఉన్నాడు. పదివేల పరుగుల క్లబ్ లో చేరిన 12వ ఆటగాడిగా, తొలి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ గానూ డబుల్ రికార్డులు సొంతం చేసుకోనున్నాడు.

                సచిన్ రికార్డును బద్దలుకొడితే వచ్చే మజానే వేరు అని ఈ డాషింగ్ బాట్స్ మెన్ అంటున్నాడు. సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. పదివేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ వయసు 31 ఏళ్ల 10 నెలలు. కాగా, కుక్ వయసు ప్రస్తుతం 31 ఏళ్ల 4 నెలలు. దీంతో క్రికెట్ దేవుడు సచిన్ రికార్డుపై కన్నేసినట్లు చెప్పకనే చెబుతున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ