ఫ్లింటాఫ్ కు ట్విట్టర్లోనే గడ్డిపెడుతున్నారు

March 29, 2016 | 01:04 PM | 1 Views
ప్రింట్ కామెంట్
andrew-flintoff_amithabh_bachchan_twitter_niharonline

ఒక్కొసారి సరదా కోసం చేసే పనులు సిరీయస్ గా మారుతుంటాయి. అదే కోవలో ఇంగ్లాడ్ స్టార్ క్రికెటర్ ఒకరికి ఇప్పుడు ఆన్ లైన్ లోనే తిట్ల దండకాలు పడుతున్నాయి. అతనే ఆండ్రూ ఫ్లింటాఫ్. సగటు భారతీయ క్రికెట్ అభిమానులందరికీ పరిచితమైన ఇంగ్లండ్ క్రికెటర్. ఎన్నోమార్లు మన దేశాన్ని సందర్శించి, ఇక్కడే వారాల తరబడి వున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తికి బిగ్ బీ అమితాబ్ ఎవరో తెలీదంట. ఆస్ట్రేలియా మ్యాచ్ లో కోహ్లీ అద్భుత పోరాట పటిమను కొనియాడుతూ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వరుస ట్వీట్లను పెడుతున్న వేళ, వాటికి వస్తున్న స్పందన చూసి... "హూ ఈజ్ దిస్ అమితాబ్" అని ఫ్లింటాఫ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం నెటిజన్ల నుంచి విమర్శలను ఎదుర్కొంది.

                                    దీంతో వందలాది మంది ఫ్లింటాఫ్ కు సామాజిక మాధ్యమాలే వేదికగా గడ్డి పెట్టగా, అదే జాబితాలో విరాట్ కోహ్లీ కూడా చేరిపోయాడు. "లండన్ లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంను సందర్శిస్తే, ఆయనెవరో తెలుస్తుంది" అంటూ మెత్తగా దెప్పి పొడిచాడు. ఇక రవీంద్ర జడేజా అయితే, మరో అడుగు ముందుకేసి "ఆయన పేరు షెహన్ షా... బంధుత్వంలో నీ అయ్యలాంటోడు" అని కాస్త ఘాటుగానే స్పందించాడు. ఫ్లింటాఫ్ ట్వీట్ పై స్పందించిన క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, "ట్విట్టర్ లో అమితాబ్ ను ఫ్లింటాఫ్ గుర్తించలేదు. ఆయన ఖాతాను మారియా షరపోవా నిర్వహిస్తున్నదేమో!" అని వ్యంగ్యాస్త్రాలు విడిచారు. ఒకవేళ అమితాబ్ ఎవరో తెలీకపోయినప్పటికీ అంత వంకరగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఏముందని మరికొంత మంది కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ