ఐపీఎల్ పై కుంబ్లే వ్యాఖ్యలు సరైనవేనా?

April 28, 2016 | 09:26 PM | 1 Views
ప్రింట్ కామెంట్
anil-kumble-opposed-IPL-shifting-niharonline

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను వ‌చ్చే ఏడాది మరో దేశంలో జరపాలని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గవర్నింగ్ నిర్ణయం తీసుకోబోతున్న దశలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్‌కుంబ్లే స్పందించాడు. భార‌త్‌లో వ‌స‌తుల కొర‌త‌ కార‌ణంతో త‌దుప‌రి ఐపీఎల్‌ను విదేశాల‌కు త‌ర‌లించాల‌ని నిర్వాహ‌కులు చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌ను అనిల్‌కుంబ్లే వ్యతిరేకించాడు. తిరువ‌నంత‌పురంలోని 'త్రివేండ్రం స్పోర్ట్స్‌హబ్‌'లో ఈ విష‌య‌మై ఆయ‌న మాట్లాడుతూ.. ఐపీఎల్‌ని ఒక గ్లోబల్‌ బ్రాండ్ గా అభివ‌ర్ణించాడు. ఐపీఎల్ ను భార‌త్ లోనే నిర్వ‌హించ‌డం ద్వారా దేశానికి ఎంతో ఆదాయం వ‌స్తుంద‌న్నాడు. ఐపీఎల్ ను విదేశాల‌కు త‌ర‌లించ‌వ‌ద్ద‌న్నాడు. త‌దుప‌రి ఐపీఎల్ భార‌త్‌లోనే జ‌ర‌గాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ