ప్రణాళికలు పక్కాగా అమలుచేయాలి, లేదంటే...

June 09, 2015 | 04:05 PM | 1 Views
ప్రింట్ కామెంట్
mcgrath_about_ravishasthri_bangladesh_tour_niharonline

బంగ్లాతో సిరీస్ కు సిద్ధమైన టీమిండియా కు ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ మెక్ గ్రాత్ సలహాలు ఇస్తున్నాడు.  ఒక టెస్టు మ్యాచ్ , మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా తమ ప్రణాళిలను పక్కాగా  అమలు చేయాలని మెక్ గ్రాత్ స్పష్టం చేశాడు.  ప్రధానంగా బంగ్లాదేశ్ తో  ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్నందున టీమిండియా ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కోలుకోవడానికి మరో అవకాశం లేదన్నాడు. ' ప్రణాళికల్లో కచ్చితత్వం ఉండాలి. వారితో ఆడేది ఒక టెస్ట్ మాత్రమే అనే సంగతి గుర్తించుకోవాలి. టెస్ట్ సిరీస్ అయితే తరువాత మ్యాచ్ గురించి ఆలోచిస్తాం. అక్కడ టీమిండియాకు రెండో ఛాన్స్ లేదు' బంగ్లాతో జాగ్రత్తగా ఆడితే టీమిండియాదే విజయం అని మెక్ గ్రాత్ తెలిపాడు.  ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగుతున్న టీమిండియా.. బంగ్లాదేశ్ ను తేలిగ్గా తీసుకోకుడూదని హెచ్చరించాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉంది. బంగ్లాతో జరిగే ఏకైక టెస్టులో గెలిస్తేనే ఈ ర్యాంక్‌ను నిలబెట్టుకోవచ్చు. ఓడిపోతే మాత్రం ఏకంగా ఏడో ర్యాంక్‌కు పడిపోతుంది.  ఒకవేళ డ్రా అయినా నాలుగో ర్యాంక్‌కు పడిపోయే అవకాశం ఉంది. సో, కోహ్లీ సేనకు ఈ సిరీస్ పెద్ద పరీక్షే అన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ