ఫేక్ న్యూస్ తో మాజీ కెప్టెన్ కి మండింది

December 21, 2015 | 12:29 PM | 5 Views
ప్రింట్ కామెంట్
Azharuddin-denies-marriage-rumour-Shannon-Marie-Talwar-niharonline

టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాదీ మేటి క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ మీడియా పై మండిపడ్డాడు. తనపై అసత్య ప్రచారంకి దిగినందుకు ఆయన ఘాటుగా స్పందించారు. 52 ఏళ్ల ఈ మాజీ కెప్టెన్ మూడో పెళ్లి చేసుకున్నారంటూ కొద్దిరోజులుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన ఫైరయ్యాడు. ‘‘నేను మూడో పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. పత్రికల్లో రాసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి’’ అని అతడు ట్వీట్ చేశాడు. వార్త కోసం చూడకండి. నిర్ధారణకొచ్చాకే రాయండంటూ తెలిపాడు.

అయితే ఆయన మూడో పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది పక్కన పెడితే అసలా వార్తలు ఎలా వ్యాపించాయో ఇప్పుడు చూద్దాం. అజారుద్దీన్ గతంలో నౌరీన్ అనే మహిళతో తొలి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకే ఆ పెళ్లి పెటాకులు కాగా, బాలీవుడ్ అందాల నటి సంగీతా బిజిలానీతో రెండో పెళ్లి చేసుకున్నాడు. 1996లో జరిగిన ఈ పెళ్లి 2010లో విడాకులతో ముగిసింది. ఇక ప్రస్తుతం 2012లో తనకు పరిచయమైన అమెరికా దేశస్థురాలు, ఫ్యాషన్ డిజైనర్ షనోన్ మేరీని అతడు ఇటీవలే వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

2013లో ప్యారిస్ లో వీరిద్దరూ సెలవులను ఎంజాయ్ చేశారన్న వార్తలు వినిపించాయి. మొన్నటికి మొన్న ఐటీపీఎల్ సిరీస్ లో భాగంగా టెన్నిస్ మ్యాచ్ ను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన అజ్జూ భాయ్ వెంట మేరీ కూడా వుంది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మరీ మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. తాజాగా ఇటీవలే చనిపోయిన తన కారు డ్రైవర్ జాన్ మహ్మద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన అజ్జూ భాయ్, మేరీని వెంటబెట్టుకుని వెళ్లాడు. అక్కడి వారికి ఆమెను తన భార్యగా పరిచయం చేశాడట. ఈ వార్తలనే మీడియా ప్రచురించిందని తెలుస్తోంది. నిప్పు లేకుండా పొగ అయితే రాదు కదా. పూసుకుని తిరిగితే అలాగే రాసేస్తారు మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ