బీసీసీఐ ఏసీయూ చీఫ్ రాజీనామా

June 06, 2015 | 12:12 PM | 0 Views
ప్రింట్ కామెంట్
BCCI_ACU_cheif_ravi_sawani_niharonline

భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) లో 2012 వ సంవత్సరంలో అవినీతి నిరోధక విభాగాన్ని ప్రారంభించి, ఆపై దానికి చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవి సవానీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన రాజీనామాను కూడా ఆమోదించినట్లు బోర్డు ప్రకటించింది. సవానీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీసీసీఐలో జరిగిన పలు అవకతవకలు, అవినీతి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. 2013లో ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత సవానీని తొలగించాలన్న డిమాండ్ పెరిగింది. గత ఏప్రిలో సవానీ రాజీనామాకు సిద్ధపడినప్పటికీ ఐపీఎల్ ముగిసే వరకు కొనసాగాలని పెద్దలు సూచించినట్లు సమాచారం. 2013 లో ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా పనిచేయటంతోపాటు స్పాట్ ఫిక్సింగ్ కేసును విచారించిన నీరజ్ కుమార్ ను బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ సలహాదారుగా తీసుకోవటంతో సవానీ వైదొలగక తప్పదనే గతంలో వార్తలు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో ఆయన ముందుగానే రాజీనామా చేసినట్లు బోర్డులో తీవ్ర చర్చ జరుగుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ