కోహ్లీ కోసం కేంద్రానికి లేఖ దేనికి?

May 03, 2016 | 01:20 PM | 1 Views
ప్రింట్ కామెంట్
virat-kohli-khelratna-BCCI-niharonline

టీమిండియా డాషింగ్ బాట్స్ మెన్ విరాట్ కోహ్లీ పై బీసీసీఐ కేంద్రానికి ఓ లేఖ రాసింది. ఇప్పటికే టెస్ట్ కెప్టెన్ గా సేవలు అందిస్తున్న కోహ్లీ త్వరలోనే ధోనీ చేతి నుంచి వన్డే పగ్గాలు కూడా తీసుకోనున్నాడు. వరుస మ్యాచ్ లలో సూపర్ ఫాంతో ఉన్నాడు కూడా. ఈ నేపథ్యంలో అతనికి రాజీవ్ ఖేల్ రత్న ఇవ్వాలంటూ డిమాండ్ తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అతడికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం బీసీసీఐ కేంద్రానికి ఓ లేఖ రాసింది. ఈ మధ్య బీసీసీఐ ప్రతిపాదనలకు కేంద్రంగా పెద్దగా అడ్డు చెప్పడం లేదు. దీంతో కోహ్లీకి ఖేల్ రత్న అవార్డు రావటం పెద్ద సమస్యేమీ కాదన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ