గెలిచినా క్రెడిట్ అవతలి టీంకి ఇచ్చేశాడు

May 06, 2016 | 11:39 AM | 2 Views
ప్రింట్ కామెంట్
pune-captain-dhoni-praises-DD-bowlers-niharonline

వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లను మట్టికరిపిస్తూ టైటిల్ రేసులో దాదాపు అన్ని సీజన్లలో నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీకి ప్రస్తుతం అంత సీన్ లేదని అనిపిస్తోంది. స్టార్ ఆటగాళ్లు గాయాలతో టోర్నీ నుంచి వైదొలగడం, తరచూ మార్పులతో ఓటములు పుణేను వెంటాడాయి. ఆల్ మోస్ట్ టోర్నీ నుంచి నిష్క్రమించే స్టేజీకి చేరుకున్న ఫూణే సూపర్ జెయింట్స్ మూడో విజయం సాధించింది. సీజన్ ఆరంభం నుంచి నిలకడలేమితో అష్టకష్టాలు పడుతున్న ధోనీ సేనకు ఇది కాస్త ఊరట కలిగించే అంశమే. దీనిపై మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ మీడియాతో మాట్లాడాడు. ఢిల్లీ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని పొగిడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా అమిత్ మిశ్రా, ఇమ్రాన్ తాహిర్ చాలా చక్కని బంతులతో తమ బ్యాట్స్ మన్ ను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించాడు.  అయినప్పటికీ పటిస్టమైన ఢిల్లీని కేవలం 162 పరుగులకే పరిమితం చేయడం మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ