చెన్నైని అలా ముక్కలు చేసేశారు

December 15, 2015 | 12:32 PM | 1 Views
ప్రింట్ కామెంట్
raina-rajkot-dhoni-pune-in-ipl-niharonline

చెన్నై రాజస్థాన్ టీంలు నిషేధంకి గురయిన నేపథ్యంలో ఐపీఎల్ లో రెండు కొత్త టీంలు వచ్చి చేరిన సంగతి తెలిసిందే. తర్వాతి సీజన్ 9కి పుణే, రాజ్ కోట్ లు రాగా, వాటిల్లో ఆటగాళ్ల కోసం వేలం నిర్వహించారు. ఇక ఈ వేలంలో ఆయా టీంలు ఆటగాళ్లను ఎంచుకున్నాయి.

పుణె జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ, అశ్విన్, రహానె, స్టీవెన్ స్మిత్ లు ఎంపికయ్యారు. ఇక రాజ్ కోట్ జట్టుకు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, మెక్ కల్లెమ్ లను ఎంచుకున్నారు. ఈ వేలంలో ధోనీ, రైనాలను ఇరు జట్లు 12.5 కోట్లుకు కొనుగోలు చేశాయి. ఇక రహానె రూ.9.5 కోట్లు, అశ్విన్ రూ.7.5 కోట్లు, జడేజా రూ.9.5 కోట్లకు ఫ్రాంఛైజీలు కొన్నాయి. ఇన్నాళ్లు ఓకే టీంలో ఉండి మంచి భాగస్వామ్యులను అందించిన టీం ముక్కలయిపోవటం కాస్త బాధకలిగించేదే అయినా మరిన్ని సరికొత్త రికార్డులు నమోదవటం మాత్రం  ఖాయంగా కనిపిస్తోంది.

ఇక రాజ్ కోట్ తరపున ఎంపిక కావటం సంతోషంగా ఉందని రైనా ట్విట్టర్లో పేర్కొన్నాడు. కొత్త ఆటగాళ్ల మద్ధతుతోపాటు  ప్రజల నుంచి మంచి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ