ధోనీ, యువీలపై దాదా కామెంట్లు

December 23, 2015 | 04:58 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Sourav-Gangul-dhoni-yuvi-niharonline

టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ ధోనీ ఆటతీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ధోనీ ఓ గొప్ప క్రికెటర్ అని, అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడని ప్రశంసల జల్లు కురిపించాడు. మరి కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడగల సత్తా ధోనీలో ఉందని చెప్పాడు. ధోనీ స్థాయికి ఎవరైనా చేరుకోవాలంటే ప్రతిభతో పాటు, కఠోర శ్రమ కూడా అవసరమని తెలిపాడు. 2019లో జరిగే ప్రపంచ కప్ కు టీమిండియా కెప్టెన్ గా ఎవరు ఉండవచ్చన్న దానికి సమాధానంగా... అది నిర్ణయించడానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పాడు.

చాలా కాలం తర్వాత టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్న ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గురించి మాట్లాడుతూ, ఆస్ట్రేలియా పర్యటనలో యువీ రాణిస్తాడనే ధీమాను వ్యక్తం చేశాడు. పాక్, భారత్ లు మళ్లీ ఆడాలనే అందరూ కోరుకుంటున్నారని... అయితే, దీనికి సంబంధించిన నిర్ణయాధికారం బీసీసీఐ చేతిలో లేదని, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని పేర్కొన్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ