ఓటమితో పాఠాలు నేర్చుకోవాలే గానీ...

January 21, 2016 | 02:58 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Gavaskar_australia_tour_2016_dhoni_team_india_niharonline

నాలుగు వన్డే మ్యాచ్ లు ఓడిపోయి వైట్ వాష్ వాకిట నిలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన వ్యాఖ్యలపై లెజెండ్ క్రికెటర్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టును సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోందని అభిప్రాయపడ్డ గవాస్కర్, జట్టు ఇలాగే ఉంటే 2019 వరల్డ్ కప్ లో ఫలితాలు అనుకూలంగా ఉండకపోవచ్చని అన్నారు. ధోనీ టీం తప్పుల నుంచి గుణపాఠాలను నేర్చుకున్నట్టు కనిపించడం లేదని అన్నారు. జట్టులో స్ఫూర్తిని నింపాల్సిన కెప్టెన్ గా వ్యవహరించాల్సిన ధోనీ, నిరాశాపూరిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు.

                         కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, ఆస్ట్రేలియా పర్యటన మొత్తం నిరుత్సాహాన్ని మిగిల్చిందని, పలువురు ఆటగాళ్లు గతంలో ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవాలను వినియగించుకోవడంలో విఫలం అయ్యారని అన్నారు. అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్న రిషీ ధావన్, గురుకీరత్ వంటి వారు ఒత్తిడిని జయించడంలో విఫలయ్యారని, మూడేళ్లలో జరిగే వరల్డ్ కప్ కోసం జట్టులో యువరక్తాన్ని మరింతగా పెంచేందుకు మేనేజ్ మెంట్ కృషి చేయాలని సూచించారు. క్రికెటర్లు చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా, వాటినే పదే పదే చేస్తున్నారని అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ