ఫైనల్ పై ఆటగాళ్లు ఏమంటున్నారంటే...

March 05, 2016 | 05:00 PM | 1 Views
ప్రింట్ కామెంట్
mortaza-dhoni-asia-cup-final-niharonline

ఆసియాకప్ టీ20 అంకం చివరికి చేరుకుంది. భారత్ ఆతిథ్య బంగ్లాదేశ్ ల మధ్య ఆదివారం జరుగనున్న తుదిపోరుపై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇరు జట్లు కూడా గెలుపుపై అమితమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. స్వదేశంలో పరిస్థితులు బంగ్లా అనుకూలించే అవకాశం ఉన్నా టీమిండియానే  ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.  కాగా, ఫైనల్ మ్యాచ్ పై అటు క్రికెటర్లతో పాటు, అభిమానుల్లోనూ  హీట్ పెరిగిపోతోంది.  ఈ పోరుపై క్రికెటర్లు తమదైన శైలిలో స్పందించారు.

యువరాజ్ సింగ్, టీమిండియా ఆటగాడు: మ్యాచ్ లో కీలక బాధ్యత వహించడంతో పాటు గేమ్ స్థితిగతుల్ని మార్చడం నా బాధ్యత.

మహేంద్ర సింగ్ ధోని, టీమిండియా కెప్టెన్ : స్వదేశీ జట్టుకు ఎప్పుడూ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దీంతో పాటు బంగ్లాదేశ్ గత కొంతకాలంగా చాలా మెరుగుపడింది.

తమీమ్ ఇక్బాల్, బంగ్లాదేశ్ ఆటగాడు : గతేడాది ఇక్కడ జరిగిన వన్డేల్లో భారత్‑ను ఓడించాం. మరొకసారి అదే ఎందుకు పునరావృతం కాకూడదు.

మోర్తజా, బంగ్లాదేశ్ కెప్టెన్ : ఇంకా ఫైనల్ ఆడాలి. ప్రతీ ఒక్కరూ గ్రౌండ్‑లో మెరికల్లా కదలాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరిచేరనీయకండి.

ఇలా సాగిపోతున్నాయి ఆటగాళ్ల స్టేట్ మెంట్లు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ