పాక్ హిందూ క్రికెటర్ సాయం కోరాడా? లేదా?

January 22, 2016 | 01:29 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Kaneria denies news of seeking help from BCCI niharonline

పాకిస్థాన్ క్రికెటర్ దానిష్ కనేరియా బీసీసీఐని ఆశ్రయించాడన్న వార్త గత రెండు రోజులుగా వార్తల్లో హల్ చల్ చేస్తుంది. ఇంగ్లిష్ కౌంటీల్లో కనేరియా ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతనిపై ఐదేళ్ల నిషేధం పడింది. ఇదే సమయంలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో సస్పెన్షన్ కు గురైన ముగ్గురు పాకిస్థానీ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ లో పునరాగమనం చేసేందుకు పాక్ క్రికెట్ బోర్డు అంగీకరించిది. అదే సమయంలో కనేరియాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాను హిందువు అయినందుకే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తనపై నిషేధం ఎత్తివేయడం లేదని పాక్ టెస్ట్ స్పిన్నర్ దానిశ్ కనేరియా ఆరోపించాడు. దీంతో తనపై నిషేధం ఎత్తివేసేలా చూడాలని కనేరియా మన బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి.

                        ఓ ఇండియన్ రిపోర్టర్ కిచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితి క్షీణించినందున ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విధించిన జరిమానాను చెల్లించలేని స్థితిలో ఉన్నానని కనేరియా స్పష్టం చేశాడట. ఈ నిషేధంపై సవాల్ చేసి, తమను కోర్టుకు లాగినందుకుగాను అయిన ఖర్చులు కలుపుకుని కనేరియా 2.5 కోట్ల రూపాయలు చెల్లించాలని జరిమానా విధించింది. దీంతో తాను మరిన్ని కష్టాల్లో ఉన్నట్టు కనేరియా తెలిపాడు. తన దగ్గర డబ్బు కూడా లేదని, ఉన్న కాస్తతో ఎంతకాలం బతకగలనో తెలీడం లేదని చెప్పాడు. యువ భారతీయులకు తాను శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించాడని వార్తలు వచ్చాయి. అయితే తాను భారత్ ను బతిమిలాడలేదని, పాకిస్థాన్ బోర్డునే ఒక అవకాశం కొరినట్లు కనేరియా ప్రకటించాడు. అదంతా ఫేక్ న్యూస్ అని ఎలా వ్యాపించిందో తెలీట్లేదని చెబుతున్నాడు. మాట మార్చటం వెనక పాక్ బోర్డు ప్రమేయం ఉన్నట్లు భోగట్టా. కాగా, పాక్ తరపున ఆడిన హిందువుల్లో కనేరియా రెండోవాడు. గతంలో అనిల్ దాల్‌పత్ కూడా పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ