యాక్సిడెంట్ లో యువక్రికెటర్ దుర్మరణం

April 16, 2016 | 02:37 PM | 1 Views
ప్రింట్ కామెంట్
KN-cricketer-nagesh-died-road-accident-niharonline

శనివారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం యువ క్రికెటర్ ప్రాణాలను బలి తీసుకుంది. కర్ణాటకకు చెందిన వర్థమాన క్రికెటర్ నగేశ్ యాక్సిడెంట్ లో అక్కడిక్కడే చనిపోయాడు. క్రికెట్ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం పావగడ తాలూకా తిరుమణి దగ్గర ఒక బైక్ ను తప్పించ బోవటంతో ఈ సంఘటన జరిగింది. మరో 14 మంది ఆటగాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నగేశ్ మృతిపై పలువురు క్రికెటర్ లు తమ సంతాపం తెలిపారు. కన్నడనాట ఓ మంచి క్రికెటర్ ని రోడ్డు ప్రమాదం మింగేసిందని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ